ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుద‌ల‌.. క్వాలిఫ‌య‌ర్, ఫైన‌ల్ మ్యాచ్‌లు ఎక్క‌డంటే..?

Thank you for reading this post, don't forget to subscribe!

  • IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజ‌న్  ఉత్కంఠ భ‌రింతంగా సాగుతోంది.
  • ఆఖ‌రి ఓవ‌ర్ థ్రిల్ల‌ర్‌లు అభిమానులను మునివేళ్ల‌పై నిల‌బెడుతున్నాయి. 
  • అన్ని జ‌ట్లు మైదానంలో నువ్వానేనా అన్న‌ట్టు త‌ల‌ప‌డుతూ అస‌లైన క్రికెట్ మజాను అందిస్తున్నాయి.
  • ఈ స‌మ‌యంలోనే ఐపీఎల్ 17వ సీజ‌న్ పూర్తి షెడ్యూల్ వ‌చ్చేసింది.
  • టోర్నీ ఆరంభానికి ముందు తొలి విడ‌త షెడ్యూల్ విడుద‌ల చేసిన బీసీసీఐ (BCCI) తాజాగా పూర్తి షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది.
  • లోక్‌స‌భ ఎన్నిక‌ల న‌గారా మోగిన‌ప్ప‌టికీ ఈసారి మొత్తం 74 మ్యాచ్‌ల‌ను భార‌త్‌లోనే నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.
  • అంతేకాదు క్వాలిఫ‌య‌ర్, ఎలిమినేట‌ర్ మ్యాచ్‌ల‌కు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుందని తెలిపింది.
  • ఇక ఫైన‌ల్ ఫైట్‌ను అంద‌రూ ఊహించిన‌ట్టుగానే చెన్నైలోని చెపాక్ స్టేడియం(Chepauk Stadium)లో నిర్వ‌హించనున్నారు.
  • మే 26వ తేదీన టైటిల్ పోరు జ‌రిగే చాన్స్ ఉంది.
  • తెల్లారే రెండో విడ‌త
  • ఏప్రిల్ 7వ తేదీన మొద‌టి విడ‌త మ్యాచ్‌లు ముగిసిన తెల్లారే రెండో విడ‌త ప్రారంభం కానుంది.
  • ఏప్రిల్ 8వ తేదీన చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK), కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(KKR) జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.
  • మే 21వ తేదీన క్వాలిఫ‌య‌ర్ 1, మే 22న ఎలిమినేట‌ర్ పోరు జ‌రుగ‌నుంది.
  • చెపాక్ స్టేడియంలో మే 24వ తేదీన క్వాలిఫ‌య‌ర్ 1, మే 26న ఫైన‌ల్ మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి.
  • నిరుడు గుజ‌రాత్, చెన్నై జ‌ట్లు ఫైన‌ల్ చేరినందున క్వాలిఫ‌య‌ర్, ఫైన‌ల్ మ్యాచ్‌లను అహ్మ‌దాబాద్‌, చెపాక్‌లో జ‌ర‌పాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది.