నేడు ఉద్యోగోన్నతుల వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్

Thank you for reading this post, don't forget to subscribe!

🔶34 అభ్యంతరాలపై సవరణలు

  ఖమ్మం ఎడ్యుకేషన్ :   లాంగ్వేజ్ పండిట్ లైన తెలుగు, హిందీ, పీఈటీ ఉపాధ్యా యుల అప్ గ్రేడ్ షన్ కోసం దశాబ్దాలుగా పోరాటం సాగించారు.

ఆంధ్రా పాలకులు అప్ గ్రేడ్ షన్ పట్టించుకున్న పాపానపోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అప్పటి సీఎం కేసీ ఆర్ అప్ గ్రేడ్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు వెంటనే జీఓలను జారీ చేసింది.

ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురుచూస్తున్న కలను సాకారం చేసిన సీఎంగా కేసీఆర్ వారి గుండెల్లో ఎప్పటికి నిలి చిపోతారు.

కోర్టు నుంచి కూడా మార్గం సుగమంకావడంతో ప్రక్రియ వేగవంతమై ఎట్టకేలకు గ్రేడ్-2 పండితులుగా, పీడీలుగా ఉద్యోగోన్నతులు పొందే ప్రక్రియలో వెబ్ ఆప్షన్స్ సైతం ఆదివారంతో ముగిశాయి.

జిల్లావ్యాప్తంగా లాంగ్వేజ్ పండిట్ తెలుగు, హిందీ, పీఈటీలు ఖాళీల జాబితా ఆధారంగా వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేశారు. సోమవారం మధ్యాహ్నానానికి ఉపాధ్యాయు లకు ఉద్యోగోన్నతులు పొందిన పాఠశాలలు అలాట్ కానున్నాయి. వారి జీవితంలో నూతన వెలుగులు రానున్నాయి.

💥34 అభ్యంతరాలు..

🌀వెబ్ఆప్షన్స్ ప్రక్రియలో కొందరు ఉపాధ్యాయులు ఆప్షన్స్ ఎంపిక చేసుకునే పాఠశాలల వివరాలు గందరగోళంగా ఉండడంతో విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు.

కొన్ని పాఠశాలలకు సంబంధించిన యూడైస్ కోడ్ వల్లనే ఆయా పాఠశాలలకు సంబంధించిన సమాచారం తప్పుగా నమోదైందని గుర్తించి వాటిని సరిచేశారు. వెబ్ ఆప్షన్స్ ప్రక్రియలో వెబ్ సైట్ లో చోటు చేసుకున్న అంశాలపై 34 మంది అభ్యంతరాలను తెలుపగా వాటిని సాధ్యసాధ్యాలను పరిశీ లించి పరిష్కరించినట్లు డీఈవో సోమశేఖరశర్మ తెలిపారు.