బుధవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం

Thank you for reading this post, don't forget to subscribe!

తెలంగాణలో మంగళ, బుధవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది.

మంగళవారం కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీగా..,

బుధవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఓ మోస్తరుగా కురిసే అవకాశాలు ఉన్నట్లు సూచించింది.

ఈ రెండు రోజులపాటు ‘పసుపు’ రంగు హెచ్చరికలను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్‌ జిల్లా తాండూరు, పెద్దేముల, దోమ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలలో 3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.

రాష్ట్రంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువన నమోదయ్యాయి.