Voter List: ఓటర్‌ లిస్టులో మీ పేరు ఉందా.. సులువుగా ఇలా చెక్‌ చేయండి..!

Thank you for reading this post, don't forget to subscribe!

Voter List : పార్లమెంట్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్లు వేయడం, విత్‌ డ్రా చేసుకోవడం , స్క్రూటినీ ఇలా అన్ని పనులు చకచకా జరిగిపోయాయి.

నాయకులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. మే 13 న ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే ఇంతకీ మీకు ఓటు హక్కు ఉందా.. ఎప్పుడైనా ఓటర్‌ లిస్టులో మీ పేరు చెక్‌ చేసుకున్నారా.. తీరా ఓటింగ్‌ రోజు ఓటర్‌ లిస్టులో పేరులేదని ఓటు వేయకుండా వస్తారా.. ప్రజాస్వామ్యం కల్పించిన అత్యంత ముఖ్యమైన హక్కు ఓటు వేయడం. మీకు ఓటరుగా అర్హత ఉండి, ఓటు హక్కు కోసం అప్లై చేయకుంటే చాలా పెద్ద తప్పు చేస్తున్నారని అర్థం. అలాగే కొత్తగా ఓటరుగా పేరు నమోదు చేసుకున్నవాళ్లు మీ ఏరియాలో మీ బూత్‌లో ఓటు ఉందా లేదా చెక్‌ చేసుకోండి. అది ఏ విధంగా అనేది ఈ రోజు తెలుసుకుందాం.

ఓటర్లందరికీ భారత న్నికల సంఘం ఎలక్టర్స్ ఫోటో గుర్తింపు కార్డు లేదా EPIC నంబర్‌ను జారీ చేస్తుందనే విషయం తెలిసిందే. దీని ద్వారా మనం సింపుల్‌గా ఓటరు లిస్టులో మన పేరు ఉందో.. లేదో తెలుసుకోవచ్చు. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఎస్ఎంఎస్ ద్వారా.. రెండోది ఈసీ హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.

SMS ద్వారా

మొదట మీ ఫోన్ నుంచి టెక్ట్స్‌ సందేశాన్ని పంపాలి.

ముందుగా EPIC ఓటర్ ఐడీ నంబర్ నోట్ చేసుకుని పెట్టుకోవాలి

ఈ EPIC voter ID numberను సందేశం రూపంలో 1950 నెంబర్‌కి పంపాలి

అనంతరం మీ నంబర్‌కు ఓ మెసేజ్ వస్తుంది. అందులో మీ పోలింగ్ బూత్ నంబర్, పేరు ఉంటాయి.

ఒకవేళ ఓటరు జాబితాలో మీ పేరు లేకుంటే మీకు ఎలాంటి మెసేజ్‌ రాదు.

హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా

ఓటరు జాబితాలో మీ పేరును తనిఖీ చేయడానికి మీరు భారత ఎన్నికల సంఘం టోల్-ఫ్రీ నంబర్‌ 1950కు కాల్ చేయాలి. దీని కంటే ముందు మీ EPIC ఓటర్ ఐడీ నంబర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. అనంతరం మీ ఫోన్‌ నుంచి 1950కి డయల్ చేయాలి. ఆ తర్వాత IVR (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) ప్రకారం మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. అనంతరం ప్రాంప్ట్ కాల్‌ను అనుసరించి ‘ఓటర్ ఐడీ స్టేటస్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడే మన EPIC ఓటర్ ఐడీ నంబర్‌ ఇవ్వాలి. అలా EPIC ఓటర్ ఐడీ నంబర్‌ ఇచ్చిన తర్వాత మీ ఐడీ స్టేటస్ తెలుస్తుంది.