Last Date : వజ్రాయుధం కోసం అప్లై చేసుకోండి.. ఇవాళే లాస్ట్ డేట్

Thank you for reading this post, don't forget to subscribe!

Last Date : ఓటు వేసేందుకు అవసరమైన కనీస వయసు మీకు వచ్చిందా ? అయితే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీ పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించుకోండి. ఓటు హక్కుకు అప్లై చేసుకునేందుకు ఇవాళే (సోమవారం) లాస్ట్ డేట్.

ఈ ఎన్నికల్లో మీరు ఓటు వేయాలని భావిస్తే.. ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్ధతుల్లో ఓటు కోసం ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆన్‌లైన్‌లో అప్లైకి 4 మార్గాలు

  • 1వ పద్ధతి : ఆన్‌లైన్ ద్వారా ఓటరు ఐడీ కోసం అప్లై చేయడానికి నాలుగు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మొదటిది nvsp వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసే పద్ధతి. తొలుత మనం www.nvsp.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫోన్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకుని లాగిన్‌ కావాలి. ఆ తర్వాత ‘రిజిస్టర్‌ యాజ్‌ ఏ న్యూ ఓటర్‌’ అనే విభాగంపై క్లిక్‌ చేస్తే ‘ఫాం-6: అప్లికేషన్‌ ఫాం ఫర్‌ న్యూ ఓటర్స్‌’ అనే సబ్ కేటగిరి కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే ఆన్‌లైన్‌ దరఖాస్తు మీ ఎదుట ప్రత్యక్షం అవుతుంది. అందులో మీ వివరాలన్నీ నింపేసి సబ్మిట్‌ చేయాలి. ఆ వెంటనే మీ ఫోన్‌ నంబర్‌కు అప్లికేషన్ రిఫరెన్స్‌ ఐడీ నంబరు మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ ఐడీ నంబరు ద్వారా మీ అప్లికేషన్ ఏ స్టేజీలో ఉందనేది ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులోని వివరాల ఆధారంగా బూత్‌ స్థాయి అధికారి మీ ఇంటి అడ్రస్‌కు చెక్ చేస్తారు. వివరాలు కరెక్టుగా ఉంటే ఓటరు జాబితాలో మీ పేరును చేరుస్తారు.
  • 2వ పద్ధతి : మనం నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం voterportal ద్వారా కూడా ఓటు కోసం అప్లై చేయొచ్చు. ఇందులోనూ మనం ఫోన్‌ నంబర్‌తోనే రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్‌ అయ్యి వెబ్‌సైట్‌లోకి ప్రవేశించాక ‘న్యూ ఓటర్‌ రిజిస్ట్రేషన్‌’ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్‌ చేసుకుంటూ వెళ్లి.. దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ సబ్మిట్‌ చేయాలి.
  • 3వ పద్ధతి : ఇక మనం గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన VoterHelpline అనే మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులోనూ మన ఫోన్‌ నంబర్‌, వివరాలను పొందుపరిచి రిజిస్టర్‌ చేసుకోవాలి. వాటి ఆధారంగానే లాగిన్‌ కావాలి. ఈ యాప్‌లో ‘ఓటరు రిజిస్ట్రేషన్‌’ విభాగంలోకి వెళితే ‘న్యూ ఓటర్‌ రిజిస్ట్రేషన్‌’ అనే మరో సెక్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి.. అడిగిన వివరాలన్నీ నింపి అప్లికేషన్‌ను సబ్మిట్‌(Last Date – Your Vote) చేయాలి.
  • 4వ పద్ధతి : మనం ఓటు కోసం ceotelangana, ceoandhra వెబ్‌సైట్లలోకి వెళ్లి ఎన్‌వీఎస్‌పీ, ఓటర్‌ పోర్టల్‌ వెబ్‌సైట్‌ లింకుల్లోకి రీడైరెక్ట్ కావచ్చు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్‌లో అప్లైకి 2 పద్ధతులు

  • 1వ పద్ధతి : బూత్‌ స్థాయి అధికారులకు (బీఎల్వోలకు) నేరుగా ఫాం-6 దరఖాస్తులను మనం సమర్పించవచ్చు.
  • 2వ పద్ధతి : ప్రతి నియోజకవర్గానికి డివిజన్‌ స్థాయి అధికారిని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఈఆర్వో)గా ఎన్నికల సంఘం నియమించింది. వారి కార్యాలయాల్లోనూ దరఖాస్తులు సమర్పించొచ్చు. ప్రతి మండలంలోనూ స్థానిక తహసీల్దార్‌ లేదా డిప్యూటీ తహసీల్దార్‌ను అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఏఈఆర్వోలు)గా నియమించింది. ఆ కార్యాలయాల్లోనూ దరఖాస్తులు ఇవ్వొచ్చు. వాటిపై విచారించి ఓటు హక్కు కల్పిస్తారు.

ఓటు హక్కు నమోదు సహా ఇతరత్రా అంశాలపై చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. ఆ సందేహాలను క్లియర్ చేసుకోవాలని భావించేవారు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య కాల్‌ చేయొచ్చు.