Thank you for reading this post, don't forget to subscribe!

🔶జులై 12 వరకు గడువు ఇచ్చిన ఎస్సీ గురుకుల సొసైటీ

ఎస్సీ గురుకుల సంక్షేమ సొసైటీలో అయిదు నుంచి తొమ్మిదో తరగతి వరకు బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి మరోసారి ఆన్‌లైన్లో దరఖాస్తులు తీసుకోవాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది.

విద్యార్థులు రూ.100 చెల్లించి https://tgswadtr.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా జులై 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ కార్యదర్శి కోరారు.

అలాగే విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ కోసం ఆన్‌లైన్లోనే దరఖాస్తు చేయాలని సూచించారు.

జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 

ఎస్సీ సొసైటీలో ఖాళీ సీట్ల భర్తీలో ప్రాధాన్యక్రమం పాటిస్తామని సొసైటీ వెల్లడించింది.

తొలుత సొసైటీలో ప్రవేశాలు పొందినా చేరని వారికి, ప్రవేశపరీక్ష రాసిన వారికి, అనాథలు, సింగిల్‌ పేరెంట్‌ ఉన్నవారికి, దివ్యాంగులు, ప్రవేశపరీక్ష రాయని వారికి వరుస క్రమ ప్రాధాన్యత కింద భర్తీ చేస్తామని తెలిపింది.

తల్లిదండ్రులు ఎవరూ సొసైటీ, ప్రాంతీయ సమన్వయకర్తల కార్యాలయాలకు రాకూడదని పేర్కొంది.

విద్యార్థుల దరఖాస్తులు పరిశీలించిన అనంతరం అడ్మిషన్‌కు అర్హులైతే రిజిస్టరు మొబైల్‌నంబరుకు సమాచారం పంపిస్తామని ఎస్సీ సొసైటీ వివరించింది.