మహేశ్వరం మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం

 

Thank you for reading this post, don't forget to subscribe!

 

పదవతరగతి పూర్తి చేసుకొన్న విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సంలో అడ్మిషన్ పొందుటకు మే 10వ తేది నుండి మే 31వ తేది వరకు www.tsmodelschools.com వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ప్రిన్సిపాల్ బి .ధనుంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎంపీసీలో 40 సీట్లు,బైపిసిలో 40సీట్లు,సీఈసీలో 40సీట్లు మరియు ఎమ్ఈసిలో 40సీట్ల చొప్పున మొత్తం 160సీట్లు అందుబాటులో ఉన్నాయి.పదవతరగతిలో పొందిన జీపీఏ మార్కుల ఆధారంగా కోరుకున్న కోర్సులో ప్రవేశం లభిస్తుంది.ఆసక్తి గల పదవతరగతి పాసైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని తెలిపారు.

వివరాలకై 9849746567 మరియు 9603150011 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు

✅మహేశ్వరం మోడల్ స్కూల్ ప్రత్యేకతలు

▶️4ఎకరాల విస్తీర్ణంలో అత్యున్నత మౌలిక వసతులతో విశాలమైన తరగతి గదులు మరియు ప్రహరీగోడతో వున్న పక్కా స్కూల్ భవనం
▶️ ఆహ్లాదకరమైన పచ్చిక బయల్లతో కూడిన పాఠశాల ప్రాంగణం మరియు పచ్చని చెట్లతో కూడిన పరిసరాలు
▶️ఇంగ్లీష్ మీడియంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యా భోధన
▶️విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు,నోట్ బుక్స్ మరియు యూనిఫాం సౌకర్యం
▶️మెరిట్ ప్రాతిపదికన మరియు దూర ప్రాంతం నుండి వచ్చే బాలికలకు స్కూల్ ప్రాంగణంలోనే హాస్టల్ వసతి
▶️సబ్జెక్టుల వారీగా విశాలమైన ల్యాబ్స్ సౌకర్యం
▶️అధునాతనమైన కంప్యూటర్లు,ప్రాజెక్టర్ల సహాయంతో హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో డిజిటల్ తరగతుల నిర్వహణ
▶️టూరిజం&హోటల్ మేనేజ్మెంట్,రిటైల్ మేనేజ్మెంట్ ట్రేడులలో వృత్తి విద్యాకోర్సులు చదువుకొనే సౌకర్యం
▶️ఆర్వో ప్లాంట్ ద్వారా స్వచ్చమైన త్రాగునీరు
▶️విశాలమైన లైబ్రరీ సౌకర్యం
▶️సీసీ కెమెరాల పర్యవేక్షణలో తరగతి గదులు మరియు పాఠశాల ప్రాంగణం
▶️ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మంచిగా చదువుకొనే విధంగా పర్యవేక్షణ
▶️ఆసక్తి గల విద్యార్థులకు క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ