తెలంగాణలో ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల 

Thank you for reading this post, don't forget to subscribe!

TS Inter Supplementary Results 2024 : తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. తాజా సమాచారం.. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి బోర్డు అధికారులు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూల్యాంకాన ప్రక్రియ పూర్తయ్యింది. సాంకేతికపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. ఆన్ లైన్ లో మార్కుల ఎంట్రీతో పాటు మరికొన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. అయితే.. ఈ ఫలితాలను వచ్చే వారం విడుదల చేస్తారని సమాచారం. ఇందుకు సంబంధించి ప్రాథమికంగా 25వ తేదీ ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ తేదీన విడుదల చేయలేకపోతే 26 లేదా 27వ తేదీల్లో ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.

కాగా.. తెలంగాణ రాష్ట్రంలో మే 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు సెకండియర్‌ పరీక్షలు నిర్వహించారు. అలాగే.. జూన్‌ 4 నుంచి 8వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించారు.