Toll Fees: రేపటి నుంచి టోల్ ప్లాజా ఫీజులు పెరగనున్నాయి.

Thank you for reading this post, don't forget to subscribe!

  • Toll Fees: వాహనదారులకు బిగ్ షాక్ తగిలింది. రేపటి నుంచి టోల్ ప్లాజా ఫీజులు పెరగనున్నాయి. ఈ మేరకు రోడ్డు విస్తరణ కాంట్రాక్ట్ సంస్థ జీఎమ్మార్ ప్రకటించింది.

  • ఈ క్రమంలో హైదరాబాద్-విజయావాడ నేషనల్ హైవే నెం. 65 లోని టోల్ ప్లాజా వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే ఫీజులను అమాంతం పెంచేసింది. దీంతో వాహనదారులు షాక్ అవుతున్నారు.

  • ఒక్కో వెహికల్‌కు వెళ్లి రావడంతో కలిపి రూ. 5 నుంచి రూ. 40 వరకు పెంచినట్లు ప్రకటించింది. మరోవైపు స్థానిక వాహనదారుల నెలవారి పాస్ ఛార్జీలను రూ. 330 నుంచి రూ. 340 వరకు వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. కాగా, యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఆంథోల్ మైసమ్మ దేవాలయం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు 181.5 కిలోమీటర్ల పొడవు గల రహదారిని దాదాపు రూ. 2,000 కోట్లతో 20212లో నాలుగు లైన్లుగా విస్తరించారు. దీనికి జీఎమ్మార్ సహకరించింది.

  • ఈ క్రమంలోనే విస్తరణ పనులకు అయిన ఖర్చును రికవరీ చేసేందుకు జీఎమ్మార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో కృష్ణా జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, చిల్లకల్లు వద్ద ఒక్కొక్కటి చొప్పున మూడు టోల్ ప్లాజాలను ఏర్పాటు చేసింది. 2012 నుంచి టోల్ ఫీజులు వసూలు చేయడం స్టార్ట్ చేసింది.

  • సంవత్సరానికి ఒకసారి టోల్ ఫీజులను పెంచేందుకు జీఎమ్మార్ కు ఎన్‌హెచ్ఏఐ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ప్రస్తుతం పెరిగిన ధరలు మార్చి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుండి అంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి రానున్నాయి. పెంచిన ధరలు ఈ సంవత్సరం అంతా చెల్లుబాటుకానున్నాయి. ఇక వాహనదారులకు మరో భారం పడినట్లైంది.