తెలంగాణ గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల..

Thank you for reading this post, don't forget to subscribe!

🍥హైదరాబాద్‌: రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన ధ్రువపత్రాల పరిశీలనకు టీజీపీఎస్సీ తేదీని ఖరారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్‌ ర్యాంకుల జాబితాను ప్రకటించిన టీజీపీఎస్సీ.. తాజాగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన మెరిట్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది

❇️ఎంపికైన అభ్యర్థులు ఈనెల 13 నుంచి వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకునేందుకు కమిషన్‌ అవకాశంకల్పించింది

✡️ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవాలని సూచించింది. వారిని మాత్రమే విడతల వారీగా ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని పేర్కొంది. అభ్యర్థులు వెరిఫికేషన్‌కు *హాజరుకావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపింది.

🌀పరిశీలన కోసం అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు కమిషన్‌ సూచించింది. కులధ్రువీకరణ, బీసీ నాన్‌ క్రీమీలేయర్, దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు, ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ/నివాస ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 2021-22 ఏడాదికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రంతోపాటు అవసరమైన పత్రాలన్నీ దగ్గర ఉంచుకోవాలని తెలిపింది

💥ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలో తప్పనిసరిగా ఈ పత్రాలన్నీ సమర్పించాల్సి ఉంటుందని.. అభ్యర్థులకు అదనపు గడువు ఇవ్వబోమని ఇప్పటికే టీజీపీఎస్సీ స్పష్టం చేసింది

♦️జాబితా కోసం క్లిక్‌ చేయండి

https://www.tspsc.gov.in/uploadPDF/GROUP-IV-CV-PREAMBLE-FINAL.pdf