తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ షెడ్యూల్ విడుదల

Thank you for reading this post, don't forget to subscribe!

TGPSC Group 1 Mains : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను తెలుగు, ఇంగ్లిష్, ఉర్ధూ భాషల్లో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. త్వరలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడనున్నాయి.

మూడు భాషల్లో గ్రూప్-1 మెయిన్స్

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను 21/10/2024 నుంచి 27/10/2024 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మెయిన్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి. గ్రూప్-1 మెయిన్స్ లో మొత్తం 06 పేపర్లు ఉంటాయి. వీటిని అభ్యర్థి ముందుగా ఎంచుకున్న మాధ్యమంలోనే రాయాల్సి ఉంటుంది. పేపర్‌లో కొంత భాగాన్ని ఇతర భాషలో రాయడానికి అభ్యర్థికి అనుమతి లేదు. ఇంగ్లిష్ లో కొంత భాగం, తెలుగు లేదా ఉర్దూలో మిగిలిన భాగం రాయడానికి అనుమతి లేదని టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది.

జనరల్ ఇంగ్లిష్ పేపర్ క్వాలిఫైయింగ్ మాత్రమేనని టీజీపీఎస్సీ ప్రకటించింది. పదో తరగతి స్టాండర్డ్ లో ఈ పేపర్ ఉంటుందని తెలిపింది. ఈ పేపర్లో వచ్చిన మార్కులు ర్యాంకింగ్ కోసం పరిగణించరమని వెల్లడించింది. మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థి తప్పనిసరిగా అన్ని పేపర్లకు హాజరు కావాల్సి ఉంటుంది. ఏదైనా పేపర్‌ రాయకపోతే ఆటోమేటిక్‌గా అనర్హతగా పరిగణిస్తారు. గ్రూప్-1 మెయిన్స్ కి సంబంధించిన సిలబస్‌తో సహా పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో ఫిబ్రవరి 19, 2024న విడుదలైన గ్రూప్-1 సర్వీసెస్ నోటిఫికేషన్ నెం.02/2024 చెక్ చేయవచ్చు.

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ ఇదే

గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.

  • జనరల్ ఇంగ్లిష్(క్వాలిఫైయింగ్ పేపర్) – అక్టోబర్ 21
  • పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22
  • పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) – అక్టోబర్ 23
  • పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) – అక్టోబర్ 24
  • పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) – అక్టోబర్ 25
  • పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) – అక్టోబ్ 26
  • పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) – అక్టోబర్ 27