ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల బ‌దిలీ, ప‌దోన్న‌తుల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం సాయంత్రం విడుద‌ల చేసింది.

Thank you for reading this post, don't forget to subscribe!

*బదిలీలు,పదోన్నతుల షెడ్యూల్ విడుదల*

జూన్ 8 వ తేదీ నుండి ఈ పక్రియ ప్రారంభం కానుంది. మల్టీ జోన్ వన్ లో జూన్ 8 నుండి 22 వరకు బదిలీలు, పదోన్నతులు జరుగనున్నాయి.

మొత్తం 15 రోజుల వ్యవధిలో ప్రక్రియ పూర్తి కానుంది. మల్టీ జోన్ 2 లో జూన్ 8 నుండి 30 వరకు ప్రక్రియ సాగనుంది.

ఇందులో ఏకంగా 23 రోజులలో పూర్తి ప్రక్రియ జరగనుంది

10 నుంచి 11 వ తేదీ వరకు దరఖాస్తులను డీఈవో పరిశీలన చేయాలి.

12,13 తేదీల్లో మార్గదర్శకాల ఆధారంగా ఉన్న బదిలీలు, పదోన్నతుల సీనియార్టీ జాబితాను ప్రకటిస్తారు.

 జాబితాపై అభ్యంతరాలున్న వారు ఉన్నతాధికారులకు ఆధారాల ద్వారా తెలియపర్చవచ్చు.

14, 15 తేదీల్లో అభ్యంతరాల అనంతరం పదోన్నతులు, బదిలీల తుది జాబితాను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంది.

16 నుంచి 20 వ తేదీ వరకు ఎస్‌జీటీలు ఎస్‌ఏలుగా పదోన్నతులు పొందే ప్రక్రియ ఉంటుంది

21 నుంచి 24 వరకు ఎస్ జి టి ల బదిలీల పక్రియ ఉంటున్నట్లు విశ్వసనీయ సమాచారం

 

https://www.tgschools.co.in/2024/06/teacher-promotions-schedule.html

ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు

Teachers Promotions and Transfers Schedules

Teacher Transfers Schedules