Thank you for reading this post, don't forget to subscribe!

 

ఇంటర్‌ ఫలితాలను ఈ నెల 24న విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.

24వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదలకానున్నాయి.

ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షా ఫలితాలను ఒకేసారి విడుదల చేయనుంది.

ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షలకు 9.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

అటు టెన్త్‌ ఫలితాలను ఈ నెల 30వ తేదీ లేదా వచ్చే నెల 1వ తేదీన విడుదల చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

మార్చి 10 తేదీ నుంచి ఈనెల 10 వ తేదీ వరకు మూల్యాంకనం చేశారు.

మార్కుల నమోదు పాటు ఎలాంటి టెక్నికల్‌ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

జవాబుపత్రాలను మూడు సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్‌, డీకోడింగ్‌ ప్రక్రియ పూర్తిచేశారు.

2023 ఏడాదిలో మే 9వ తేదీన ఫలితాలను ప్రకటించారు.

ఈసారి అంతకంటే 15 రోజుల ముందే ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు.

ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడిని ఎన్నికల సంఘం అనుమతించింది.

ఎన్నికల కోడ్‌ దృష్ట్యా మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు.