Thank you for reading this post, don't forget to subscribe!

 

రైతు బీమా కోసం తేది 28/06/2024 నాటికి PPB పొందిన వారి డేటా ధరణి పోర్టల్ (CCLA) నుండి వ్యవసాయ శాఖకి అందింది, కావున మీ వయస్సు ఆధార్ కార్డు ప్రకారం 18 నుంచి 59 సంవత్సరాలు అనగా తేది 14/08/1965 నుండి 14/08/2006 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే ఈ 2024 సంవత్సరం ఈ నెల 30వ తేదీలోగా మీ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి(AEO)ని రైతు వేదికలో కలిసి రైతు బీమా కి దరఖాస్తు చేసుకోగలరు.,

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
👉రైతు బీమా దరఖాస్తు ఫారం
👉పట్టా పాసుపుస్తకం జిరాక్స్
👉ఆధార్ కార్డు జిరాక్స్
👉నామిని ఆధార్ కార్డు జిరాక్స్ లతో
పట్టాదారు స్వయంగా వచ్చి వ్యవసాయ విస్తరణ అధికారి(AEO)ని సంప్రదించి రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోగలరు.,

గమనిక :

రైతు బీమా లో నామిని మరణించినచో నామిని మార్పునకు, తప్పుల సవరణకు ఈ నెల 30 వ తేది వరకు అవకాశం కలదు.
ఇది వరకే దరఖాస్తు చేసుకున్న రైతులు మరల దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదు.

 

Rythu Bheema NOMINATION Form

 

THANK YOU 

DIVITI VENKATESH

CONTACT NO: 9505360250