RPF Recruitment 2024 | నిరుద్యోగులకు శుభవార్త.

Thank you for reading this post, don't forget to subscribe!

 

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF)లలో మొత్తం 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి, ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. మే 14 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు : 4,660

పోస్టులు : ఎస్సై, కానిస్టేబుల్

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు : అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.

అర్హ‌త‌లు : ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి, ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎంపిక : రాత పరీక్ష, సీబీటీ, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతం : పోస్టుల‌ను బ‌ట్టి రూ.21700 నుంచి రూ.35000 వ‌ర‌కు

వయోపరిమితి: కానిస్టేబుల్ పోస్టులకు 18-28, ఎస్సై పోస్టులకు 20-28

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం : ఏప్రిల్‌ 15

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ : మే 14

వెబ్‌సైట్ : https://rpf.indianrailways.gov.in/RPF/

 

THANK YOU

DIVITI VENKATESH

CONTACT NO: 9505360250