1.G.O.Ms.No.1 Dt:1-1-1994 ప్రకారం పాఠశాలలు ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి.వసూలు చేసిన ఫీజుల్లోoచి 50%
మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లిoచాలి.
ప్రతి ఏడాది వార్షిక నివేదికలు,ఆడిట్ రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించాలి.2020-21,2021-22,2022-23,2023-24.

Thank you for reading this post, don't forget to subscribe!

2.G.O.Ms.No.42 Dt:30-7-2010 ప్రకారం ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్ట్ ఫీ రేగ్యులేషన్ కమిటీ(DFRC) అనుమతి తీసుకోవాలి.2020-21,2021-22,2022-23,2023-24

3.G.O.Ms.No.246 ప్రకారం పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి.

4.సీబియస్ఈ చట్ట ప్రకారం ప్రతి పాఠశాలలో ‘పేరెంట్ టీచర్ అసోసియేషన్’ఏర్పాటు చేసుకోవాలి.
ఈ అసోసియేషన్లో ఇద్దరు తల్లిదండ్రులకు భాగస్వామ్యం కల్పించాలి.వీరిని సంప్రదిన్చిన తరువాతనే ఫీజులను పెంచాలి.

5.G.O.Ms.No.91 Dt:6-8-2009 ప్రకారం వన్ టైం ఫీజుగా అప్లికేషన్ ఫీజు రూ100,
రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.500,రిఫన్డబుల్ కాషన్ డిపాజిట్ రూ.5000లకు మించకుండా తీసుకోవాలి.

6.జీవోలోని సెక్షన్ 1(c) ప్రకారం పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ,యూనిఫాంలనుస్కూల్ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న ఖచ్చితమైన నిబంధన లేమి పెట్టరాదు.వీటి అమ్మకాలకు పాఠశాలలల్లో కౌంటర్లు ఏర్పాటు చేయరాదు. విద్యార్ధుల తల్లిదండ్రులకు నచ్చిన షాపులో కొనుగోలు చేయవచ్చు.

7.C&DSE Proc Rc.No.780 Dt:16-5-2013
సెక్షన్ 8(1) ప్రకారం పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్,ఐఐటి,ఒలంపియాడ్,కాన్సెప్ట్,ఈటెక్నో అనే తోకలేవి తగిలించరాదు. కేవలం పాఠశాల అని మాత్రమే పేర్కోనాలి.