• కేంద్ర ప్రభుత్వం పేదలు, కార్మికులు, వృద్ధులు, మహిళల, చిన్నారులకు కొన్ని వందల పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా కార్మికుల కోసం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పథకాన్ని తీసుకొచ్చింది.
  • దీని ద్వారా 30 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు మేలు చేయాలని చూస్తోంది. ఈ-శ్రమలో చేరేందుకు అర్హతలు, ఏవిధంగా అప్లయ్ చేసుకోవాలి వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
  • కేంద్ర ప్రభుత్వం కార్మికులకోసం తీసుకొచ్చిన స్కీం.. ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్. ఈ- శ్రమ కార్డు పొందిన కార్మికులు 60 ఏళ్ల వయసు వచ్చాక నెలకు రూ. 3000 పెన్షన్ పొందవచ్చు. దీంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. దివ్యాంగులకు ఆర్థిక సాయం కూడా అందుతుంది.

ఈ-శ్రమ కార్డు అర్హతలు

Thank you for reading this post, don't forget to subscribe!

  • ఈ-శ్రమ కార్డు పొందాలంటే.. కార్మికుల శ్రామిక పథకం కింద రిజిస్టర్ చేయించుకుంటే ఈ-శ్రమ కార్డు లభిస్తుంది. దీనికి దరఖాస్తుదారులు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసుండాలి. ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ఉండాలి

ఈ-శ్రమ కార్డు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి

  • ఈ -శ్రమ కార్డు కంప్యూటర్, మొబైల్ లోని డౌన్ లోడ్ చేసుకోవచచు. ఆధార్ కార్డు లాగే ఈ కార్డుపై కూడా 12 అంకెల నంబర్ ఉంటుంది. ఇది కార్మికులకు గుర్తింపు కార్డులా పనిచేస్తుంది. ఈ కార్డు డైన్ లోడ్ చేసుకోవడానికి ముందుగా అధికారిక పోర్టల్ https//eshram.gov.in లోకి వెళ్లాలి. తర్వాత ఈ-శ్రమ ట్యాబ్ లో రిజిస్టర్ పై క్లిక్ చేయాలి. అక్కడ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. మొబైల్ కి OTP వస్తుంది. దీంతో వెరిఫికేషన్ పూర్తవుతుంది. తద్వారా ఈ-శ్రమ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఏవైనా సందేహాలుంటే..హెల్ప్ లైన్ నంబర్ 1443కి కాల్ చేసి సందేహాలపై క్లారిటీ తీసుకోవచ్చు.