జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవము

Thank you for reading this post, don't forget to subscribe!

🍥ది. 20-06-2024 (NATIINAL DEWORMING DAY)
ఖమ్మం జిల్లా పాఠశాల విద్యాశాఖ పరిధిలోని అన్ని యాజమాన్యాల విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది….

👉ALBENDAZOLE TABLETS (400mg)ను విద్యార్థులు తప్పకుండా వాడేటట్లు చేయడంలో ప్రధా నోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు (ముఖ్యంగా Bio. science) కీలక పాత్ర వహించాలి.

👉ప్రార్థనా సమయంలో (school assembly) నులిపురుగులు ఎందుకు తయారవుతాయి, వాటి వలన నష్టాల గురించి విద్యార్థులకు వివరించాలి.

👉విద్యార్థులకు, వారి తల్లి దండ్రులకు ఈ విషయమై ఏవైనా అపోహలు ఉంటే వాటిని తొలగించి, టాబ్లెట్స్ వినియోగించే లా ప్రోతహించాలి.

👉ముందుగా టీచర్స్ విద్యార్థుల ముందు టాబ్లెట్ చప్పరిస్తూ తీసుకోవాలి. తద్వారా అందరిలో టాబ్లెట్ వినియోగం పై పాజిటివ్ అభిప్రాయం కలిగించాలి.

👉 వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ, AAPC, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల వారి సమన్వయం, సహకారం తో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చి విజయవంతం చేయాలి.

👉మాసివ్ గా అందరూ ఒకే రోజు టాబ్లెట్ తీసుకోవటం వల్ల నులిపురుగులు తుడిచిపెట్టుకు పోతాయి.

👉నులిపురుగులు పెద్ద సంఖ్యలో ఉన్న వారు టాబ్లెట్ తీసుకున్నపుడు కొద్దిసేపు మగతగా ఉంటుంది

👉నులిపురుగుల పై టాబ్లెట్‌ చర్య వల్ల ఇలా జరుగుతుంది.

👉 టాబ్లెట్ వినియోగించిన తర్వాత ఎవరికైనా అవాంఛనీయ లక్షణాలు గమనిస్తే వెంటనే వారికి వైద్య సదుపాయం అందించడానికి సమాచారం ఇవ్వండి. ఇందు కొరకు ప్రత్యేకంగా సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు.

💥DOSAGE

1)1 to 2 Years age- half
tablet ను రెండు స్పూన్స్ తో పొడి చేసి ఇవ్వాలి

2)2 to 3 years age-one
tablet crush చేసి ఇవ్వాలి.

3)3 to 19 years age
-one tablet
నమలించాలి.

4)Tablets ఇంటికీ
ఇవ్వరాదు.స్కూల్ లోనే మధ్యాహ్నం lunch అయిన అరగంట తర్వాత ఇవ్వాలి.

5)ఈ టాబ్లెట్ వలన ఎలాంటి
సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

6)భోజనము చేసిన తర్వాత
మాత్రమే ఇవ్వాలి.*

7) ఈ కార్యక్రమానికి సంబంధించి HM లు, *ఉపాధ్యాయులు తప్పనిసరిగా వైద్య- ఆరోగ్యశాఖ సిబ్బందికి పూర్తిగా సహకరిస్తూ తగిన ఏర్పాట్లు చేయాలి