ITR: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్.. మార్చి 31లోపు ఈ పని చేయకపోతే 200 శాతం పెనాల్టీ!

Thank you for reading this post, don't forget to subscribe!

 

ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139(8A) ప్రకారం ITRని రివైజ్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది.

ఎవరైనా ట్యాక్స్‌ రిటర్న్స్‌లోని మిస్టేక్స్‌ని సరిదిద్దకపోతే.. వాటిని ట్యాక్స్‌ అధికారులు గుర్తించిన సందర్భంలో చెల్లించాల్సిన పన్నులో 200 శాతం వరకు పెనాల్టీలు చెల్లించాల్సి రావచ్చు. కొన్ని సార్లు చట్టపరమైన చర్యలూ ఎదుర్కోవలసి వస్తుంది.

అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2017-18 నుంచి సెక్షన్ 270A అమలులోకి వచ్చింది. ఆదాయాన్ని దాచిపెట్టి, వివరాలు ఐటీఆర్ లో వెల్లడించకపోతే/తప్పుడు మినహాయింపులు చూపించి రిఫండ్ పొందినవారు, చెల్లించాల్సిన పన్నులో 50 శాతం నుంచి 200 శాతం మేర జరిమానా విధించవచ్చని ఈ సెక్షన్ పేర్కొంటోంది.

ట్యాక్స్ చెల్లింపుదారులు రివైజ్డ్‌ రిటర్న్‌ను దాఖలు చేయడానికి మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంటుందని గుర్తుంచుకోవాలి.