24 నుంచి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు పరీక్షలు
Thank you for reading this post, don't forget to subscribe!
రాష్ట్రంలోని పలు సంక్షే మ శాఖలకు సంబంధించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఈ నెల 24 నుంచి 28 వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు
✡️ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్(సీబీఆర్టీ) విధానంలో జరుగుతాయని పేర్కొన్నారు
💥ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్ 2(ఎడ్యుకేషన్) అంశాలపై పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
వార్డెన్ గ్రేడ్-1, గ్రేడ్2, మాట్రన్ గ్రేడ్-1, గ్రేడ్2 పోస్టుల భర్తీకి ఈ నెల 29న ఉద యం, మధ్యాహ్నం పరీక్షలుంటాయని వెల్లడించారు.
అభ్యర్థులు తమ హాల్టికెట్లను టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు