Health Tips: మద్యం ఆరోగ్యానికి హానికరం. కానీ ఈ విషయం తెలిసి నా మందుకు ఎవరూ దూరంగా ఉండడం లేదు. పండుగలు, పార్టీల పేరుతో లిక్కర్‌ లాగిస్తున్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!

ఇక హైదరాబాద్‌ లాంటి పెద్ద నగరాల్లో వీకెడ్స్‌ వస్తే చాలు యువత మద్యంలో మునిగి తేలుతుంది. సాయంత్రం కాగానే చిల్‌ అవుతారు. ఈ మధ్య అమ్మాయిలు కూడా మందు లాగించేస్తున్నరు. బ్రీజర్లు, బీర్లతోపాటు వొడ్కా వంటి డ్రింక్స్‌ తాగుతున్నారు.

కొందదరు బీర్లు.. కొందరు లిక్కర్‌..
ఇక మందు పార్టీలో పది మంది కూర్చుంటే.. అందులో కొందరు బీర్లు ఇష్టపడతారు. కొందరు లిక్కర్‌ తాగుతారు. బీర్‌లో గ్యాస్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో పొట్ట వస్తుందని చాలా మంది బీర్‌ కాకుండా విస్కీ, రమ్, బ్రాండీ, వొడ్కా వంటివి తాగుతారు. ఇక బీర్‌ అయితే నేరుగా తాగొచ్చు కానీ, విస్కీ, రమ్, బ్రాండీ తాగేవారు అందులో నీళ్లు లేదా సోడా మిక్స్‌ చేస్తారు. మరి విస్కీ లేదా రమ్‌ లేదా బ్రాందీలో నీళ్లు కలుపెకోవడం మంచిదా.. సోడా మిక్స్‌ చేయడం మంచిదా అనే విషయం చాలా మందికి తెలియదు. కొందరు సోడా, వాటర్‌ రెండూ మిక్స్‌ చేస్తారు.

సోడా ఎక్కు విష్టం..
సాధారణంగా మందులో సోడా కలుపుకుని తాగేందుకు చాలా మంది ఎక్కువ ఇష్టపడతారు. సోడా కలపడం వలన లిక్కర్‌ సాఫ్ట్‌గా మారుతుందని భావిస్తారు. అందుకు ఎక్కువగా సోడా మిక్స్‌కు ఇష్టపడతారు. సోడా కలిపితే తాగిన వెంటనే మత్తు కూడా రాదు. అందుకే చాలా మంది సోడాను మందులో కలుపుకుంటారు. కానీ, కొందరు సోడా కాకుండా నీళుల కలుపుకుంటారు. సోడా కలుపుకుంటే ఆల్కాహాల్‌ రుచి పోతుందని, కడుపులో గ్యాస్‌ పెరుగుతుందని నీళ్లు కలుపుకుంటారు.

ఏది మంచిది..
బాండ్రీలో కలుపుకునే సోడా, నీళ్లలో ఏది మంచిది అంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మందులో సోడా కన్నా నీళ్లు కలుపుకోవడమే మంచిది. సోడా ఎక్కువగా తాగడం వలన ఎసిడిటీ వస్తుంది. ఉదర సంబంధ ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే మందులో నీళ్లు కలుపుకోవడమే మంచిది. ఏది కలుపుకోవాలి అనే విషయం పక్కన పెడితే మద్యం తాగడమే మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఎప్పుడు ఒకసారి తాగితే ఇబ్బంది ఉండదు. కానీ రోజూ తాగడం మాత్రం మంచిది కాదు. మద్య రోజూ తాగితే లివర్‌ చెడిపోతుంది. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.