ప్రశాంతంగా గ్రూప్-1పరీక్షలు✍️

Thank you for reading this post, don't forget to subscribe!

💠దరఖాస్తు చేసుకున్న వారు 4.03 లక్షల మంది- హాజరైన అభ్యర్థులు 3.02 లక్షలు

🔹త్వరలో కమిషన్ వెబ్సైట్లో ప్రిలిమ్స్ కీ

♦️షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ 21న మెయిన్స్

💠వివరాలు వెల్లడించిన టీజీపీఎస్సీ

🔶నిమిషం ఆలస్యం నిబంధన నిక్కచ్చిగా అమలు

🔹పలు చోట్ల నిరాశతో వెనుదిరిగిన అభ్యర్థులు

రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 31 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 897 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులకుగాను 3.02 లక్షల మంది అభ్యర్థులు (74 శాతం) హాజరయ్యారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వెల్లడించింది. ఉదయం 10 గంటల వరకే అనుమతిస్తామని ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఐతే కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద కొందరు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని అనుమతించలేదు. ఒక్క నిమిషం నిబంధనతో చాలా మంది పరీక్ష రాయలేక పోయారు. ప్రతి కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్ బందంతో పాటు 3 నుంచి 5 కేంద్రాలకు ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ బందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలను నిర్వహించారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసేయడంతో పాటు 100 మీటర్ల వరకు144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని త్వరలో కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ 21న మెయిన్స్ నిర్వహించనున్నట్టు కమిషన్ పేర్కొంది

♦️అక్కడక్కడా అపశ్రుతులు

🌀పరీక్ష నిర్వహణ విషయంలో రాష్ట్రంలో అక్కడక్కడా అపశ్రుతులు నెలకొన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రం ముందు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అరగంట టైమున్నా ఐదు నిమిషాలు మాత్రమే ఉందని ఇన్విజిలేటర్ చెప్పడంతో తొందరగా ఆన్సర్ చేశామని వారు ఆరోపించారు. అబిడ్స్ స్టాన్లీ కాలేజ్ పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందే తరలివచ్చారు. అధికారులు విధించిన నిబంధనలు పాటించాలని పరీక్షా కేంద్రాల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఏర్పాటు చేసిన కేంద్రానికి పలువురు అభ్యర్థులు ఆలస్యంగా రాగా అనుమతించ లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆలస్యంగా వచ్చివారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటకి పంపంచారు

🔶రెండు సార్లు రద్దు.

💥గ్రూప్1 పరీక్ష రెండు సార్లు రద్దయింది. 2022లో కమిషన్ నోటిఫీకేషన్ ఇచ్చింది. ఆ తర్వాత అక్టోబర్లో ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్స్ కోసం 1:50 నిష్పత్తితో అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే పరీక్షా పత్రాలు లీకేజీ వ్యవహారంలో పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్ 11న రెండోసారీ ప్రిలిమ్స్ నిర్వహించగా, ప్రక్రియలో లోపాలు జరిగాయని కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఈ పరీక్షను సైతం రద్దు చేశారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేయడంతో పాటు కొత్తగా 60 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో కమిషన్ 563 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది