EPFO: చందాదారులకు శుభవార్త చెప్పిన పీఎఫ్.. నేటి నుంచి అమల్లోకి..

Thank you for reading this post, don't forget to subscribe!

  • ద్యోగం చేసే ప్రతి ఒక్కరికి దాదాపు పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. అయితే ప్రభుత్వం ఉద్యోగులైతే ప్రభుత్వంలోనే పని చేస్తారు. కానీ ప్రైవేట్ ఉద్యోగులు ఎన్నో కంపెనీలు మారుతారు.
  • ఇలా కంపెనీ మారినప్పుడు.. పీఎఫ్ ఖాతా నంబర్ కూడా మారుతుంది. దీంతో ఏ ఖాతాలో డబ్బు ఆ ఖాతాలోనే ఉండిపోతుంది. డబ్బంతా ఒక్క ఖాతాలోకి రావాలంటే.. పీఎఫ్ కు రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. అయితే పీఎఫ్ చాలా మందికి అవగాహన లేక ఇలా చేయడం లేదు.
  • తాజాగా ఈపీఎఫ్ఓ సంస్థ చందాదారులకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. మీరు కంపెనీ మారి మరో కంపెనీలో చేరి చందా ప్రారంభించగానే.. మీ పాత ఖాతా డబ్బులు ఆటోమెటిగ్గా ప్రస్తుత ఖాతాలోకి జమ అవుతాయి. దీన్నే ఆటోమేటెడ్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ అంటారు. అయితే ఈ నిర్ణయంపై పూర్తి సమాచారం లేదు. అలాగే చాలా మందికి పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా తెలియదు.
  • అలాంటి వారు.. వారు పని చేస్తున్న కంపెనీ హెచ్ఆర్ వద్దకు వెళ్లి యూఏఎన్ నంబర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ కు వెళ్లాళి. సర్వీస్ లో ఎంప్లాయిస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇందులో ఆన్ లైన్ సర్వీస్ పై క్లికి చేయాలి. అప్పుడు యాక్టివ్ యూఏఎన్ నంబర్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఓక ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో యూఏఎన్ నంబర్, ఆధార్ నంబర్, పేరు, ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. గెట్ ఆథంటికేషన్ పై క్లిక్ చేయాలి.
  • మీకు ఓ ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ యూఏఎన్ నంబర్ యాక్టివ్ అవుతుంది. మీ ఫోన్ నంబర్ కు పాస్ వర్డ్ మెసేజ్ వస్తుంది. ఈ పాస్ వర్డ్ సహాయంతో లాగిన్ అయి పాస్ వర్డ్ చెంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ అయి బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. లేదా ఉమంగ్ యాప్ ద్వారా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.