చెక్‌ బౌన్స్ కేసు ఎలా ఫైల్ చేయాలి

Thank you for reading this post, don't forget to subscribe!

1) చెక్ నీ ఏ తేదికి అయితే రాసి ఇస్తారో ఆ తేదీ నుండి సరిగ్గా 3 నెలలు కాలంలో బ్యాంకు లో వేయవలెను

2) ఒక వేల అట్టి చెక్ ను బ్యాంకు వారు సరిపడ డబ్బులు లేకున్నా లేదా వేరే ఎదైనా కారణం ద్వారా రిటర్న్ అనగా CHEQUE BOUNCE అయితే బ్యాంకు వారు RETURN MEMO ఒకటి రాసి స్టాంపు వేసి ఇస్తారు

3) అట్టి బౌన్స్ అయిన చెక్కు ను మరియు రిటర్న్ మెమో నీ ఆమసుకున్న 30 రోజుల లోపే మీ అడ్వకేట్ నీ సంప్రదిస్తే సదరు అడ్వకేట్ వారికి NI ACT NEGOTIABLE INSTRUMENTS ACT 138 1881 ప్రకారం వారికి LEGAL NOTICE/DEMAND NOTICE📜📜 పంపిస్తారు

4) అట్టి నోటీసు ఎదుటి వారికి చేరిన తరువాత వారు 15 రోజుల్లో నోటీసు కీ సమాదానము ఇవ్వవలెను

5) ఒకవేళ సదరు వ్యక్తి తీసుకున్న మొత్తం 15 రోజుల లోపు చెల్లించకపోతే అతని ‌మీద CHEQUE BOUNCE CASE దాఖలు చేయవలెను

6) కెసు అనేది వారి ఏ బ్యాంకు కి సంబంధించిన చెక్ అయితే ఇచ్చారో ఆ బ్యాంకు ఏ పోలీసు స్టేషను ‌పరిధిలో వస్తుందో ఆ పోలీసు స్టేషను ఏ జుడిషియారి కిందికి వస్తుందో ఆ కోర్టు లో కేసు నమోదు అవుతుంది