కారులో గంట ఏసీ ఆన్‌ చేస్తే ఎంత పెట్రోల్‌ కావాలో తెలుసా?

Thank you for reading this post, don't forget to subscribe!

Car AC: ఈ రోజుల్లో అన్ని కార్లలో ఏసీ సదుపాయం ఉంటోంది. వేసవిలో దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. లాంగ్‌ డ్రైవ్‌ సమయంలో సౌకర్యవంతమైన జర్నీ కోసం కార్లలో ఏసీ ఆన్‌ చేస్తారు.

వాహనంలో ఏసీ పెట్రోల్‌నుంచి ఉత్పత్తి అయ్యే శక్తితో నడుస్తుంది. అందువలన ఏసీని ఎంత వాడితే ఎంత పెట్రోల్‌ ఖర్చవుతుందో తెలుసుకుందాం.

  • పెరిగిన ఎండలు..

    మన దేశంలో ఎండల తీవ్రత ఏటా పెరుగుతోంది. కారులో కూర్చోగానే చెమటలు పట్టే స్థాయి. దీంతో ఏసీ ఆన్‌ చేయాలి అనిపిస్తుంది. ఇలా మన దేశంలో కార్లలో ఏసీ వాడకం ఎక్కువైంది. ఎయిర్‌ కండీషన్‌ లేని కారులో ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంటుంది.

  • గంట ఏసీ ఆన్‌ చేస్తే..

    కారులోని ఏసీ, పెట్రోల్‌ నుంచి ఉత్పత్తయ్యే శక్తితోనే పనిచేస్తుంది. ఒక గంటపాటు ఏసీ ఆన్‌చేయడం వలన ఎంత పెట్రోల్‌ అవసరమో తెలుసుకుందాం. పెట్రోల్‌ వినియోగం అన్నిరకాల కార్లకు ఒకేలా ఉండదు. ఇందులో అనేక అంశాలు ఉంటాయి. కారు ఇంజిన్‌ సైజు ఎంత, ఏసీ పనితీరు ఎలా ఉంది, బయటివైపు ఉష్ణోగ్రత ఎలా ఉంది, కారు వేగం ఎంత అనే అంశాలపై ఆధారపడి ఏసీ పనిచేస్తుంది. పెట్రోల్‌ తీసుకుంటుంది. గంటపాటు ఏసీ వాడితే 1.2 లీటర్ల పెట్రోల్‌ ఖర్చవుతుంది. ఇదే సమయంలో కారులో ఏసీ వాడకంతో మైలేజీ 5 నుంచి 10 శాతం తగ్గుతుందని ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ నిపుణులు తెలిపారు.

  • 20 శాతం పెట్రోల్‌ పెరుగుదల..

    కారులో వెళ్తూ ఏసీ ఆన్‌చేసి ఉంటే పెట్రోల్‌ వినియోగం దాదాపు 20 శాతం పెరుగుతుంది. ఏసీ కంప్రెషర్‌ రన్‌ అయ్యేందుకు చాలా పెట్రోల్‌ అయిపోతుంది. ఏసీకి పవర్‌ ఇచ్చేందుకు ఇంజిన్‌ ఎక్కువా వాడాల్సి వస్తుంది. ఇక ఏసీ ఆన్‌ చేసి అతివేగంగా కారు నడుపుతున్నా, లేక ట్రాఫిక్‌లో జామ్‌ అయినా ఏసీ పెట్రోల్‌ వాహనం అంతకంతకూ పెరిగిపోతుంది.

మొత్తంగా ఏసీ అత్యవసరం అనిపించినప్పుడు మాత్రమే వాడడం మేలు. కారును నీడలో పార్కు చేయాలి. వీలైనంత వరకు కారు విండో డోర్లను ఓపెన్‌ చేయడం ద్వారా వచ్చే గాలితో ఎడ్జస్ట్‌ అవ్వడం బెటర్‌. అలాగే.. కారు టైర్లలో గాలి ఫుల్లుగా ఉండేలా చూసుకోవాలి. కారులో అనవసరమైన వస్తువుల్ని తొలగించాలి. కారును స్థిరమైన వేగంతో నడిపితే.. ఫ్యూయల్‌ వాడకం తగ్గుతుంది.