నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2024 (JEE Main 2024) సెషన్ 2 పరీక్షల తేదీలను మరోసారి సవరించింది.

Thank you for reading this post, don't forget to subscribe!

తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ మెయిన్స్ (Joint Entrance Examination) పరీక్షలు ఏప్రిల్ 4న ప్రారంభమై ఏప్రిల్ 12న ముగుస్తాయని తెలిపింది.

  • జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కొత్త పరీక్షల తేదీల షెడ్యూల్ ను jeemain.nta.ac.in లో చూడవచ్చు.

  • తొలుత పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసినప్పుడు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య పరీక్షలు జరుగుతాయని పేర్కొన్న ఎన్టీఏ.. ఆ తర్వాత ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • బోర్డు పరీక్షల కారణంగా.. తాజాగా ఆ షెడ్యూల్ లో స్వల్ప మార్పు చేసింది.

జేఈఈ మెయిన్స్ ఇంటిమేషన్ స్లిప్ విడుదల.. 31న అడ్మిట్ కార్డుల!

  • తాజా షెడ్యూల్ ప్రకారం.. JEE మెయిన్ ఏప్రిల్ 2024 సెషన్ పేపర్ 1 (B.E./B.Tech) పరీక్ష ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో జరగనుంది.

  • పేపర్ 2 పరీక్ష ఏప్రిల్ 12న నిర్వహించనున్నారు. రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.

  • ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టు పరీక్షలు జరుగుతాయి.

  • పేపర్ 2 పరీక్ష మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే నిర్వహించనున్నారు.

  • ఏప్రిల్ 12న.. పేపర్ 2A (B. Arch), పేపర్ 2B (B.Planning), పేపర్ 2A & 2B (B.Arch & B. ప్లానింగ్ రెండూ) మొదటి షిఫ్ట్‌లో ఉదయం 9:00 నుండి 12:30 వరకు నిర్వహించబడతాయి.

  • దేశం వెలుపల ఉన్న 22 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 319 నగరాల్లోని వివిధ కేంద్రాలలో జేఈఈ పరీక్షలు నిర్వహిస్తారు.