టీచర్ బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం

Thank you for reading this post, don't forget to subscribe!

🍥ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధ్యాయ బదిలీల ప్రక్రి యలో భాగంగా మల్టీ జోన్-2లోని ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.

ఒకే చోట కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తి చేసు కున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం రెండ్ రోజులు అవ కాశం ఇచ్చింది.

కాగా, మల్టీ జోన్-2 పరిధిలోని 14 జిల్లాల్లో ఉపాధ్యాయ సీనియారిటీ జాబితాను శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉంది.

 

ఇక జోన్‌-1లో బదిలీలు.. 2లో పదోన్నతులు

 రాష్ట్రంలో మల్టీ జోన్‌-1(వరంగల్‌) పరిధిలోని 19 జిల్లాల్లో పదోన్నతుల ప్రక్రియ ముగియడంతో ఇక అక్కడ సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) బదిలీల ప్రక్రియ మొదలుకానుంది.

ఈ జోన్‌ పరిధి పాఠశాలల్లోని ఎస్జీటీలు స్కూల్‌ అసిస్టెంట్లుగా, పీఎస్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతి పొంది సంబంధిత పాఠశాలల్లో చేరిన సంగతి తెలిసింది.

దీంతో ఆ ఖాళీల భర్తీకి మిగిలిన ఎస్జీటీలకు బదిలీ అవకాశం ఇవ్వనున్నారు.

అందుకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మొదలైంది.

మరోవైపు మల్టీ జోన్‌-2(హైదరాబాద్‌) పరిధి పాఠశాలల్లోని (రంగారెడ్డి జిల్లా మినహా) ఎస్జీటీలు, భాషా పండితులు, పీఈటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇచ్చేందుకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది